వ్యక్తిగత వెబ్‌సైట్‌తో ఓట్ల నమోదు
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి ఓట్ల నమోదు ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది.
- సర్వోత్తంరెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తున్నరు
- ఓటర్ల నమోదులో కాంగ్రెస్ అభ్యర్థి అక్రమాలు
- సీఈవోకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఫిర్యాదు
- విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి ఓట్ల నమోదు ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. అధికారిక ఎన్నికల సంఘం వెబ్సైట్ (ceo.telangana.nic.in) కాకుం డా, కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తిగత వెబ్సైట్ (ramreddy sarvotham. com) ద్వారా ఫారం-18 ఓట్ల నమోదు ప్రక్రియను చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఓటర్ల వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డులు, ధ్రువీకరణ పత్రాలను టెక్ఫినోటాక్స్, కాన్ బిజ్, 24హెచ్ ఆర్7 కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రైవేట్ సంస్థల ద్వారా సేకరిస్తున్నారని, దీనివల్ల ఓటర్ల వ్యక్తిగత సమాచారానికి రక్షణ లేకుండా పోతున్నదని ఫిర్యాదులో పేరొన్నారు.
దరఖాస్తుదారులకు అధికారిక పద్ధతికి విరుద్ధంగా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వాట్సాప్‌లోనే ఫారం-18 దరఖాస్తు రసీదులు, అప్లికేషన్ నంబర్లు వస్తుండటంపై సాంకేతిక లోపాలు లేదా అనధికారిక ప్రవేశాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తంచేశారు. ఫొటోలు, డాక్యుమెంట్ల అప్లోడ్ పరిమితులు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలకు బదులుగా సెల్ఫీలను స్వీకరించడం వంటి నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాంరెడ్డి సర్వోత్తంరెడ్డికి సంబంధించిన వెబ్సైట్ ద్వారా సాగుతున్న ఫారం-18 నమోదు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర సాంకేతిక ఆడిట్ నిర్వహించి, అధికారిక వ్యవస్థలోకి అనధికారిక ప్రవేశం జరిగిందా? లేదా అని తేల్చాలని కోరారు. ప్రైవేట్ సంస్థల పాత్ర, డాటా సేకరణ తీరుపై దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

