చెంపలేసుకున్న ఈనాడు పత్రిక
పచ్చరాతల పత్రిక ఈనాడుకు శృంగభంగమైంది. కడుపు నిండా తెలంగాణ వ్యతిరేతకను నింపుకొని అసత్యాలను వండివార్చే విషపుత్రిక చేసిన తప్పునకు చెంపలేసుకున్నది. కోర్టు ఆదేశాలు ఇవ్వకపోయినా ‘కేటీఆర్ సహా నలుగురి పాస్‌పోర్టుల జప్తునకు ఆదేశం’అంటూ అసత్యాన్ని అచ్చేసినందుకు కోర్టు సాక్షిగా క్షమాపణ కోరింది. కోర్టు వ్యవహారాలకు వక్రీకరణలు జోడించి అడ్డంగా దొరికిపోయి న్యాయవ్యవస్థ ముందు తల దించుకొని, చేతులు కట్టుకొని నిలబడింది. పచ్చ పార్టీ మానసపుత్రుడి ప్రాపకం కోసం పిచ్చిరాతలు రాసినందుకు తగినశాస్తి జరిగింది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు క్షమాపణ
- తప్పుడు వార్తకు పత్రిక చరిత్రలో మొదటిసారీ
- కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు తలవంచిన ఈనాడు యాజమాన్యం
- కేటీఆర్ పాస్‌పోర్టుపై తప్పుడు వార్త ప్రచురించామని పశ్చాత్తాపం
- సంబంధిత కథనాలను అన్ని వేదికల నుంచి తొలగించినట్టు స్పష్టీకరణ
- కేటీఆర్ న్యాయవాది పంపించిన నోటీసుకు సంస్థ సమాధానం
- వ్యవహారాన్ని ముగించాలని విన్నపం
పచ్చరాతల పత్రిక ఈనాడుకు శృంగభంగమైంది. కడుపు నిండా తెలంగాణ వ్యతిరేతకను నింపుకొని అసత్యాలను వండివార్చే విషపుత్రిక చేసిన తప్పునకు చెంపలేసుకున్నది. కోర్టు ఆదేశాలు ఇవ్వకపోయినా ‘కేటీఆర్ సహా నలుగురి పాస్‌పోర్టుల జప్తునకు ఆదేశం’అంటూ అసత్యాన్ని అచ్చేసినందుకు కోర్టు సాక్షిగా క్షమాపణ కోరింది. కోర్టు వ్యవహారాలకు వక్రీకరణలు జోడించి అడ్డంగా దొరికిపోయి న్యాయవ్యవస్థ ముందు తల దించుకొని, చేతులు కట్టుకొని నిలబడింది. పచ్చ పార్టీ మానసపుత్రుడి ప్రాపకం కోసం పిచ్చిరాతలు రాసినందుకు తగినశాస్తి జరిగింది.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): తప్పుడు వార్తను ప్రచురించినందుకు చరిత్రలో మొదటిసారిగా ఈనాడు పత్రిక యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులతో దెబ్బకు దిగొచ్చింది. ‘కేటీఆర్ పాస్‌పోర్టు సీజ్’ అనే శీర్షికతో ఈనాడులో ఇటీవల ప్రచురించిన కథనం తప్పుడు వార్తేనని అంగీకరించింది. ఇందుకు పశ్చాత్తాపం ప్రకటించింది. క్షమాపణలు కోరింది. ఈ వార్తను తమ సంస్థలకు చెందిన అన్ని రకాల డిజిటల్ మాధ్యమాల నుంచి తొలగించినట్టు వెల్లడించింది.
ఈ మేరకు తన న్యాయవాది ద్వారా వివరణ ఇచ్చింది. కేటీఆర్ పాస్‌పోర్టును సీజ్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వకపోయినప్పటికీ, ఇచ్చినట్టుగా ఈనాడు దినపత్రిక ఇటీవల తప్పుడు కథనం ప్రచురించింది. దీనిపై కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో దిగొచ్చిన ఈనా డు యాజమాన్యం.. కేటీఆర్ పాస్‌పోర్టు వ్యవహారంలో తమ పత్రికలో తప్పుడు వార్తను ప్రచురించినట్టు అంగీకరించింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని, పొరపాటున తప్పు జరిగిందంటూ పశ్చాత్తాపం వ్యక్తంచేసింది. తప్పుడు వార్త ప్రచురించినందుకు క్షమాపణలు కోరింది. ఇక ఈ వ్యవహారాన్ని ముగించాలని కేటీఆర్ తరపు న్యాయవాదిని కోరింది.
కేటీఆర్ పాస్‌పోర్టుల విషయంలో తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన మెమోను తప్పుగా అర్థం చేసుకొని, కేటీఆర్ పాస్‌పోర్టును తాతాలికంగా జప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్టుగా వార్త ప్రచురించడం పొరపాటేనని అంగీకరించింది. ఈ వ్యవహారంపై కేటీఆర్ తరఫు న్యాయవాది ఎన్ లలితారెడ్డి సెప్టెంబర్ 30న పంపిన లీగల్ నోటీసుకు.. ఈనాడు సంస్థ తరఫు న్యాయవాది జీవీఎస్ జగన్నాథరావు అక్టోబర్ 13న సమాధానం ఇచ్చారు.
సెప్టెంబర్ 29న ఈనాడు హైదరాబాద్ ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తలో ఏసీబీ దాఖలు చేసిన మెమోలోని అంశాలను తప్పుగా పేరొన్నట్టు ఆ సమాధానంలో వివరించారు. పాస్‌పోర్టులను తాతాలికంగా జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా వార్తలో రాయడం పొరపాటని సంస్థ తరఫున అంగీకారం తెలిపారు. పాస్‌పోర్టుల విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని ఏసీబీ కోరిందని, ఈ మేరకు దాఖలు చేసిన మెమోలోని అంశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే వార్తలో పొరపాటు చోటుచేసుకున్నదని వివరణ ఇచ్చారు. వాస్తవానికి పాస్‌పోర్ట్ స్వాధీనం కోసం ఏసీబీ దాఖలు చేసిన మెమో ఆధారంగా కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.

అన్ని వేదికల్లో ఆ కథనం తొలగించాం
ఈనాడు ప్రచురించిన వార్తలో జరిగిన పొరపాటు ఉద్దేశపూర్వకమైనది కాదని, అది నిజమైన పొరపాటేనని, ఇందుకు తీవ్రంగా విచారం వ్యక్తంచేస్తున్నామని ఈనాడు తరఫు న్యాయవాది తెలిపారు. ఈ విషయంపై అక్టోబర్ 7న ఈనాడు ఎడిషన్‌లో వివరణ ప్రచురించి, పొరపాటును సరిదిద్దామని పేరొన్నారు. కేటీఆర్ తరఫున న్యాయవాది లలితారెడ్డి పంపిన నోటీసులో చేసిన డిమాండ్‌ను కూడా నెరవేర్చామని తెలిపారు.
ఆ నోటీసు అందిన వెంటనే ఈనాడు డిజిటల్, సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచురితమైన సంబంధిత కథనాలన్నింటినీ తొలగించామని వెల్లడించారు. వార్తలో జరిగిన తప్పును సరిదిద్దుతూ అక్టోబర్ 7న ఈనాడు వివరణ ప్రచురించిందని న్యాయవాది తన సమాధానంలో పేరొన్నారు. ఈ పొరపాటు ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదని, అనుకోకుండా జరిగిందని, ఇందుకు తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నామని వివరించారు. పొరపాటు జరిగిందని వివరణ ప్రచురించడం, సంబంధిత డిజిటల్ కథనాలను తొలగించడం వంటి చర్యలను ప్రస్తావిస్తూ, ఈ అంశంపై తదుపరి చర్యలు తీసుకోకుండా చూడాలని ఈనాడు సంస్థ తరఫు న్యాయవాది కోరారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

