e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 25, 2022
Home News అంధులతో నిరాడంబరంగా..

అంధులతో నిరాడంబరంగా..

  • ఘనంగా ఎంపీ సంతోష్‌ కుమార్‌ పుట్టిన రోజు
  • దేవనార్‌ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జన్మదినం
  • ఉప్పల్‌ భగాయత్‌లో మొక్కలు నాటిన ఎంపీ
  • యూసుఫేన్‌ దర్గాకు చాదర్‌ సమర్పణ

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ తన జన్మదిన వేడుకలను మంగళవారం బేగంపేటలోని దేవనార్‌ అంధుల పాఠశాలలో నిరాడంబరంగా జరుపుకున్నారు. కేక్‌ను కట్‌ చేసి విద్యార్థులకు తినిపించి, బ్లాంకెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రావు, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

సిటీబ్యూరో, డిసెంబర్‌ 7 (నమస్తే తెలంగాణ)/అబిడ్స్‌/బేగంపేట్‌/ఉప్పల్‌/ఎర్రగడ్డ: రాజ్యసభ సభ్యుడు, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ సృష్టికర్త సంతోష్‌కుమార్‌ పుట్టిన రోజు వేడుకలు గ్రేటర్‌ వ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరిగాయి. బేగంపేట్‌ దేవనార్‌ అంధుల పాఠశాలలో టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు అశీష్‌కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ ను ఎంపీ కట్‌ చేసి.. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

- Advertisement -

అనంతరం పాఠశాల ప్రాంగణంతో పాటు ఉప్పల్‌ భగాయత్‌లో ఏర్పాటు ఎంపీ మొక్క నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, టూరిజం చైర్మన్‌ ఉప్పల్‌ శ్రీనివాస్‌ గుప్తా, ఎంబీసీ మాజీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ, కార్పొరేటర్లు బన్నాల గీతాప్రవీణ్‌ ముదిరాజ్‌, శాంతిసాయిజెన్‌ శేఖర్‌, పన్నాల దేవేందర్‌రెడ్డి, జెర్రిపొతుల ప్రభుదాస్‌, స్వర్ణరాజ్‌, బొంతు శ్రీదేవి పాల్గొన్నారు.

చాదర్‌ సమర్పించిన ఎంపీ..

ఎంపీ సంతోష్‌కుమార్‌ తన పుట్టినరోజును పురస్కరించుకొని నాంపల్లిలోని యూసుఫేన్‌ దర్గాకు చాదర్‌ సమర్పించారు. ఎంపీ ఇంటి నుంచి చాదర్‌ను తీసుకువచ్చి మతపెద్దలతో పాటు మాజీ డిప్యూటీ మేయర్‌, బోరబండ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌కు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మతపెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బాబాఫసియుద్దీన్‌ ఆధ్వర్యంలో చాదర్‌ సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్‌ సభ్యులు కిశోర్‌గౌడ్‌, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, టీఎస్‌టీఎస్‌ చైర్మన్‌ చిరుమళ్ల రాకేశ్‌, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కోఫౌండర్‌ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement