Telangana BJP : తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈసారి ఈటెల రాజేందర్ (Etela Rajender)ను లక్ష్యంగా చేసుకొని అతడికి వ్యతిరేకంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వర్గం పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఈటల ఏడుపే బీజేపీకి శాపం, బీసీ నాయకులు ఎదుగుతుంటే ఎందుకంత అసహనం అంటూ మేడ్చల్‌లో చాలా చోట్ల ఫ్లెక్సీలు పెట్టారు అరవింద్ అనుచరులు.
ఈటెల రాజేందర్‌కు బీజేపీ చాలా చేసిందని.. అయినా ఆయన మాత్రం ఎప్పుడూ ఎంపీ అర్వింద్‌పై ఏడుస్తుంటారని ఫ్లెక్లీలు పెట్టారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు.. సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు.. కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు.. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ. ఓడిపోయినా మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గెలిచినా కూడా “నా ఇమేజ్ తోనే గెలిచాను” అనడం ఏ రాజకీయ నైతికత? అని ఈటలను ప్రశ్నించారు.
ఈటెల ఏడుపే బీజేపీకి శాపం!
తెలంగాణ బీజేపీలో ముసలం
ఈటెల వర్సెస్ అరవింద్
ఈటెల రాజేందర్ మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్
రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు
సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు
కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు
రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ… pic.twitter.com/dEbNT5T1k0
— Telugu Scribe (@TeluguScribe) May 31, 2026
అంతేకాదు బీసీ నాయకులు ఎదుగుతుంటే ఈటెలకు అసహనం ఎందుకు? అని.. ఇందూరు బిడ్డ ఎంపీ అర్వింద్‌కు వస్తున్న ఆదరణ చూసి కడుపుమంట ఎందుకు? “నేనే బీసీ నాయకుడిని… నేనే ప్రత్యామ్నాయం” అనే భ్రమ నుంచి బయటకు రా ఈటెల అంటూ మేడ్చల్‌లో పలు చోట్ల ఎంపీ అరవింద్ వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.