కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు మూడు రోజులుగా ఇన్‌ఫ్లో నిలకడగా వస్తుంది. దీంతో ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా మంగళవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 3107.38 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది.
ప్రాజెక్టు 2గేట్ల ద్వారా దిగువకు 1693.34 క్యూసెక్కులు, కాలువలకు 574.52 క్యూసెక్కుల నీటిని వదులుతున్నా రు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.30 అడుగులుగా (4.02 టీఎంసీలు) నిల్వ ఉన్నట్లు ఏఈ డి.ఉదయ్‌కుమార్ తెలిపారు.