న్యూఢిల్లీ: చంద్రుడి నుంచి వెలువడే దుమ్ముతో సూర్యుడి కిరణాల నుంచి భూమిని రక్షించే ప్రక్రియ చేపట్టవచ్చని ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చంద్రుడి ఉపరితలం నుంచి సేకరించిన ధూళిని ఆకాశంలో చల్లితే, దట్టమైన మేఘాలు ఏర్పడుతాయని, తద్వారా సూర్య కిరణాల ప్రభావాన్ని తగ్గించవచ్చని వివరించారు.
దీనికి సంబంధించిన ఒక కంప్యూటర్ మాడల్‌ను రూపొందించామని, దాని ప్రకారం కార్యాచరణలో సానుకూల ఫలితాలు రావొచ్చని పరిశోధకులు బెంజమిన్ బ్రోమ్లే, సమీర్ ఖాన్, స్కాట్ కెన్యాన్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని పీఎల్ఓఎస్ జర్నల్‌లో ప్రచురించారు.