Mohan Lal | ఇటీవలే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో మరో ఘనతను తన కెరీర్లో వేసుకున్న మలయాళం సూపర్‌స్టార్ మోహన్ లాల్ తాజాగా మరో రికార్డును నమోదు చేశాడు. ఈ ఏడాది తన సినిమాలతో కేవలం మలయాళం బాక్సాఫీస్ వద్దనే రూ.250 కోట్లకు పైగా వసూళ్లను సాధించాడు. ఇందులో ఎంపురాన్ చిత్రంతో పాటు తుడరుమ్, హృదయపూర్వం చిత్రాలు ఉన్నాయి.
ఎంపురాన్ చిత్రం ఈ ఏడాది మార్చి 27న విడుదలై వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.250 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా వచ్చిన నెలలోపే తుడరుమ్ అంటూ మళ్లీ వచ్చాడు మోహన్ లాల్. ఈ చిత్రం కూడా వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.233 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక రీసెంట్గా వచ్చిన లాల్లెట్టన్ హృదయపూర్వం కూడా దాదాపు రూ.70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఇందులో ఎంపురాన్ చిత్రంతో పాటు తుడరుమ్ కేరళ బాక్సాఫీస్ వద్దనే రూ.100 కోట్లకు వసుళ్లను సాధించి రికార్డును సృష్టించాయి. దీంతో ఒకే ఏడాది రూ.250 కోట్ల వసూళ్లను రాబట్టిన నటుడిగా చరిత్ర సృష్టించాడు. అయితే ఈ ఏడాది ముగియడానికి ఇంకా 3 నెలలు టైం ఉండడంతో మోహన్ లాల్ నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.