Ram Gopal Varma | వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్‌గా నిలిచాడు. తాజాగా ఆర్జీవి.. మెగా ఫ్యామిలీకి ఓ అద్భుతమైన సలహ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఓ ఎమోషనల్ నోట్‌తో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.”22 సెప్టెంబర్ 1978న ‘ప్రాణం ఖరీదు’తో నటుడిగా మీ ముందుకొచ్చాను. ఈ 47 ఏళ్ల ప్రయాణంలో మీరు చూపిన ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అంటూ పేర్కొన్నారు.
అన్నయ్య ట్వీట్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్.. “పుట్టుకతోనే మా పెద్దన్నయ్య ఓ ఫైటర్. రిటైర్మెంట్ అనేది ఆయన జీవితంలో లేదు. ఇతరులకు అండగా నిలిచే గుణం ఆయనది” అంటూ రిప్లై ఇచ్చారు. దీనికి స్పందించిన చిరంజీవి..“ధన్యవాదాలు తమ్ముడూ…నీ మాటలు నా మనసుకు తాకాయి. ‘ఓజీ’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా ఘన విజయం సాధించాలి” అంటూ ఆశీర్వదించారు. ఈ భావోద్వేగ ట్వీట్ల మధ్య రంగంలోకి దిగిన ఆర్జీవీ, తనదైన స్టైల్లో స్పందించాడు.చిరు, పవన్ కలిసి సినిమా చేస్తే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లందరికీ అది ఒక మెగా పవర్ ఫేవర్ అవుతుందని.. అది ఈ శతాబ్దానికి మెగా పవర్ ఫిలిం తప్పక అవుతుందని తెలియజేశాడు.
అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు నెగెటివ్ కామెంట్స్ చేసిన ఆర్జీవి ఇప్పుడు పవర్ స్టార్‌ను ఉద్దేశించి చేసిన పాజిటివ్ ట్వీట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అయితే వర్మను అంత ఈజీగా నమ్మలేం. ఆయన ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాడంటూ చాలామంది కౌంటర్లు వేస్తున్నారు. ఇక ఆర్జీవి ఈ మధ్య సినిమాల కన్నా కాంట్రవర్సీస్తోనే హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. ఆయన ఏ సినిమా తీసిన కూడా అస్సలు విజయం సాధించలేకపోతుంది. దీంతో ప్రజలలో అటెన్షన్ కోసం అప్పుడప్పుడు ఇలాంటి ట్వీట్స్ చేస్తూ ఉంటాడు.