Mohan Lal | రూ.250 కోట్ల కలెక్షన్స్.. మలయాళం బాక్సాఫీస్ వద్ద మోహన్ లాల్ రికార్డు
Mohan Lal | ఇటీవలే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో మరో ఘనతను తన కెరీర్లో వేసుకున్న మలయాళం సూపర్‌స్టార్ మోహన్ లాల్ తాజాగా మరో రికార్డును నమోదు చేశాడు.
Mohan Lal | ఇటీవలే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో మరో ఘనతను తన కెరీర్లో వేసుకున్న మలయాళం సూపర్‌స్టార్ మోహన్ లాల్ తాజాగా మరో రికార్డును నమోదు చేశాడు. ఈ ఏడాది తన సినిమాలతో కేవలం మలయాళం బాక్సాఫీస్ వద్దనే రూ.250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్రను సృష్టించాడు. ఇందులో ఎంపురాన్ చిత్రంతో పాటు తుడరుమ్, హృదయపూర్వం చిత్రాలు ఉన్నాయి.
ఎంపురాన్ చిత్రం ఈ ఏడాది మార్చి 27న విడుదలై వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.250 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా వచ్చిన నెలలోపే తుడరుమ్ అంటూ మళ్లీ వచ్చాడు మోహన్ లాల్. ఈ చిత్రం కూడా వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.233 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక రీసెంట్గా వచ్చిన లాల్లెట్టన్ హృదయపూర్వం కూడా దాదాపు రూ.70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఇందులో ఎంపురాన్ చిత్రంతో పాటు తుడరుమ్ చిత్రాలు కేవలం కేరళ బాక్సాఫీస్ వద్దనే ఒక్కొక్కటి రూ.100 కోట్లకు పైగా వసుళ్లను సాధించి రికార్డును సృష్టించాయి. దీంతో మలయాళం బాక్సాఫీస్ వద్ద ఒకే ఏడాది రూ.250 కోట్ల వసూళ్లను రాబట్టిన నటుడిగా మోహన్ లాల్ చరిత్ర సృష్టించాడు. అయితే ఈ ఏడాది ముగియడానికి ఇంకా 3 నెలలు టైం ఉండడంతో మోహన్ లాల్ నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

