Lord Hanuman: టెక్సాస్‌లోని హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
Lord Hanuman : టెక్సాస్ రాష్ట్రంలో సుమారు 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల ప్రతిష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ తప్పుపట్టారు.
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సుమారు 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని(Lord Hanuman) ఇటీవల ప్రతిష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ తప్పుపట్టారు. అమెరికా అంటే క్రైస్తవులకు చెందిన దేశమని ఆయన అన్నారు. టెక్సాస్‌లోని సుఘర్ ల్యాండ్ పట్టణంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మీ ఆలయ పరిసరాల్లో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో భారీ హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చిన్నయజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆ విగ్రహాన్ని స్థాపించారు.
హిందువులు ఆరాధించే ఆంజనేయుడి విగ్రహ ఏర్పాట్ల పట్ల రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ అసహనం వ్యక్తం చేశారు. హిందువులు పూజించే దేవుడు నకిలీ అని, ఆ దేవుడి విగ్రహాన్ని ఎందుకు టెక్సాస్‌లో ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు. ఇది క్రైస్తవులు ఉండే దేశమని తన ఎక్స్ అకౌంట్లో ఆయన పోస్టు చేశారు. సుఘర్ ల్యాండ్‌లో ఉన్న విగ్రహానికి చెందిన వీడియోను కూడా షేర్ చేశారాయన.
మరో సోషల్ మీడియా పోస్టులో ఆయన బైబిల్ సూక్తిని వ్యాఖ్యానించారు. నేను, తప్ప మరో భగవంతుడి మీకు లేరని, మీరెవరు కూడా మరొకరి విగ్రహాన్ని ఏర్పాటు చేయరాదు అని, ఎటువంటి చిత్రాన్ని పెట్టవద్దని బైబిల్లో చెప్పిన సూక్తిని ఆయన వల్లించారు.
రిపబ్లికన్ నేత డంకన్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఆ స్టేట్మెంట్ను ఖండించింది. హిందువులకు వ్యతిరేకంగా,రెచ్చగొట్టే రీతిలో ఉన్నట్లు హెచ్ఏఎఫ్ ఆరోపించింది. టెక్సాస్‌లో ఉన్న రిపబ్లికన్ పార్టీకి ఈ ఘటన పట్ల ఫిర్యాదు కూడా చేశామన్నారు. ఏ మతాన్నైనా అవలంబించే స్వేచ్ఛను అమెరికా రాజ్యాంగ కల్పించిందన్నారు.
డంకన్ చేసిన వ్యాఖ్యలను ఓ ఎక్స్ యూజర్ తప్పుపట్టారు. మీరు హిందువు కానంత మాత్రాన, దేవుడు తప్పుడు కాలేడన్నాడు. భూమిపై ఏసుక్రీస్తు పుట్టడానికి రెండు వేల ఏళ్ల క్రితమే వేదాలను రచించారని, అవి అసాధారణ గ్రంధాలని అన్నారు. ఆ గ్రంధాల ప్రభావం క్రైస్తవంపై ఉన్నదని, అందుకే ఆ మతానికి ప్రాధాన్యత, గౌరవాన్ని ఇచ్చి.. దాన్ని అధ్యయన చేయడం ఉత్తమం అని జోర్డన్ అన్నారు.
Hello @TexasGOP, will you be disciplining your senate candidate from your party who openly contravenes your own guidelines against discrimination—displaying some pretty sordid anti-Hindu hate—not to mention disrespect for the 1st Amendment’s Establishment Clause? https://t.co/5LItlu7Zu2 pic.twitter.com/oqZkZozUBR
— Hindu American Foundation (@HinduAmerican) September 22, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

