Mohammed Siraj | హైదరాబాద్, ఆట ప్రతినిధి : టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. శనివారం యూసుఫ్‌గూడలోని ఫస్ట్ బెటాలియన్‌లో సిరాజ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. గతేడాది తెలంగాణ ప్రభుత్వం సిరాజ్‌తో పాటు యువ బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగాలు కల్పించిన విషయం విదితమే.