వేతన జీవులనుంచి ఇన్‌కం ట్యాక్స్ పిండుతున్న కేంద్రం
ఏడేండ్లుగా స్లాబ్‌లు మార్చని బీజేపీ సర్కార్
రాష్ట్రప్రభుత్వం పెంచిన పీఆర్సీ కూడా ఐటీ చెల్లింపులకే సరి
కార్పొరేట్ శక్తులకు వరాలు.. ఉద్యోగులపై చిన్నచూపు
కేంద్రం తీరుపై మండిపడుతున్న ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు
వేతన జీవులను కేంద్రం వెతలపాల్జేస్తున్నది. ఆదాయం పన్ను పరిమితులు పెంచాలని ఏడేండ్లుగా దేశవ్యాప్తంగా ఉద్యోగులు చేస్తున్న వినతిని పెడచెవిన పెడుతున్న మోదీ ప్రభుత్వం.. వారి జేబులకు మాత్రం కత్తెరపెట్టడం ఆపలేదు. ఏడేండ్లుగా ఐటీ రాయితీని పెంచలేదు. స్లాబ్‌లను సవరించలేదు. ధరల పెరుగుదలతో వేతనజీవుల ఖర్చులు సైతం తడిసిమోపెడవుతున్నాయి. ఈ అంశాన్ని పట్టించుకోకుండా అధికారంలోకి వచ్చిననాటి నుంచీ ఉద్యోగులపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. ఏడాదికి రూ.2.50లక్షలు దాటితే చాలు 5 నుంచి 30శాతం వరకు పన్నుల భారం మోపుతుండడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ రెండుసార్లు పీఆర్సీని ప్రకటించి జీతాలు పెంచితే.. బీజేపీ సర్కారు పన్ను పరిమితుల్లో మార్పులు చేయకుండా నోటికాడి కూడు లాక్కుంటున్నదని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
-నిజామాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పి దూసుకుపోతున్నది. ధరల పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది.. సామాన్య జనాల నడ్డి విరిచేలా ఇంధన ధరలను మోదీ సర్కారు రికార్డు స్థాయిలో పెంచింది. కర్కషంగా వ్యవహరిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఫలితంగా వేతన జీవులకు ఖర్చులు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో చమటోడ్చి పనిచేస్తున్న వీరందరి నుంచి ఏటా ఆదాయ పన్ను రూ పంలో కేంద్ర ప్రభుత్వం రూ.వేల నుంచి రూ.లక్షల్లో ట్యాక్స్ వసూలు చేస్తున్నది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతున్న అంశాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోకుండా వేతన జీవులపై 2014 నుంచి మోదీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. ఏడాదికి రూ.2.50లక్షలు జీతం దాటితే చాలు 5శాతం నుంచి మొదలు 30శాతం వరకు ఎడాపెడా పన్నుల భారం మోపుతుండడంపై మండిపడుతున్నారు. ఏడేండ్లుగా దేశ వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నప్పటికీ వారి విన్నపాలను బీజేపీ ప్రభుత్వం ఆలకించడం లేదు. తీవ్రమైన భారాన్ని అలాగే మోపుతున్నది.
మోదీ తీరుతో వేతన జీవుల విలవిల…
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అత్యంత తెలివిగా పన్నుల విధానంలో సరళీకరణ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నది. ఆదాయపు పన్ను చెల్లింపునకు రకరకాల పద్ధతులకు తెరలేపుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్ చెల్లింపునకు రెండు విధానాలను తీసుకువచ్చింది. 2022-23 బడ్జెట్లో ఐటీఆర్‌కు రెండేండ్ల గడువు అంటూ మరో కొత్త డ్రామాకు తెరలేపింది. గందరగోళంగా ఉన్న శ్లాబుల విధానాన్ని మార్పు లు, చేర్పులు చేయాలని సర్వత్రా డిమాండ్ ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం ఏటా ఆయా వర్గాల వినతులను బుట్టదాఖలు చేస్తున్నది. సబ్కా వికాస్… సబ్కా సాత్ అంటూ భారీ ప్రకటనలు చేస్తున్న మోదీ ప్రభుత్వం మాత్రం దొడ్డిదారుల్లో వేతనజీవుల నుంచి పన్నులు లాగుతుండడంపై విమర్శలు పెరుగుతున్నాయి. 2022-2023లోనూ 0 నుంచి రూ.2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను ఉండదు. రూ.2.50లక్షల నుంచి రూ.5ల క్షల వరకు 5శాతం, రూ.5లక్షల నుంచి రూ.7.50లక్షల వరకు 10 శాతం, రూ.7.50లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15శా తం ఆదాయ పన్ను విధించనున్నారు. రూ. 10లక్షల నుంచి రూ.12.50 లక్షల వరకు 20శాతం, రూ.12.50లక్షల నుంచి రూ.15లక్షల వరకు 25శాతం, రూ.15లక్షలకు పైనా ఆదాయం ఉన్న వారికి 30శాతం పన్ను వర్తించనున్నది.
పన్ను పోటు ఇలా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు రెండుసార్లు ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించారు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి. ఉద్యోగాల్లో చేరిన వ్యక్తి ఐదేండ్లు పూర్తి చేసుకుంటే చాలు వారంతా ఇప్పుడు కేంద్రం విధిస్తున్న పన్ను పోటుకు గురవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు దాదాపుగా ఎనిమి దేండ్లలో తమ హక్కుల కోసం ప్రభుత్వంతో చర్చించి పెంపును సాధించాయి. సీఎం కేసీఆర్ సైతం ఉద్యోగులకు అండగా నిలుస్తూ వారి వేతనాలను పెంచారు. తెలంగాణ ప్రభుత్వంలో సబార్డినేట్‌గా పని చేస్తున్న వారి వార్షిక ఆదాయం దాదాపుగా రూ. 5లక్షలు దాటుతున్నది. అంటే వీరిపై కేంద్రం 10శాతం పన్ను విధిస్తున్నది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ఉద్యోగుల నెలవారీ జీతం భారీగా ఉండడంతో వారి గ్రేడ్ల ఆధారంగా వార్షిక ఆదాయం ఇప్పుడు రూ.10లక్షలకు చేరువైంది. ఉద్యోగి వార్షిక ఆదాయం రూ.10లక్షలు దాటితే 15శాతం పన్నును కేంద్ర సర్కారు వసూ లు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు పెంచితే… కేంద్ర ప్రభుత్వం మాత్రం పన్ను స్లాబుల్లో మార్పులు చేయకుండా అప్పనంగా పన్నుపోటుకు గురి చేస్తుండడం విడ్డూరంగా మారింది.
ద్రవ్యోల్బణం అరికట్టలేక..
దేశంలో ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తున్నది. ఎనిమిదేండ్ల బీజేపీ పరిపాలనలో ద్రవ్యోల్బణం 8శాతానికి చేరుతున్నది. 2014లో 5శాతంగానే ద్రవ్యోల్బణం ఉండగా బీజేపీ ఏలుబడిలో 3శాతం ఎగబాకింది. నిత్యావసరాల ధరలను నియంత్రణ చేయకపోగా… సామాన్య ప్రజల బతుకులతో కేంద్రం ఆటాడుకుంటున్నది. మోదీ సర్కారు వైఫల్యం మూలంగా వేతన జీవులకు తీవ్రంగా నష్టాలు సంభవిస్తున్నాయి. పెరిగిన ఖర్చులతో వారంతా సేవింగ్స్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. భారీగా పన్ను పోటుతో ఇక్కట్లు పడుతున్నారు. స్టాండర్ట్ డిడక్షన్‌ను రూ.లక్షకు పెంచాలన్న డిమాండ్‌ను సైతం కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలుగా ఉంది. ఆదాయ పన్ను పరిమితిని రూ.10లక్షల వరకు వెసులుబాటు కల్పించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. లేదంటే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమంటూ హెచ్చరిస్తున్నాయి.
గుణపాఠం తప్పదు..
ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరంకుశంగా ఉంది. ఏడేండ్లుగా ఉద్యోగ సంఘాలు మొర పెట్టుకుంటున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదు. ఉద్యోగులంతా కలిసి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం భారీగా జీతాలు పెంచింది. కేంద్రం మాత్రం ఎడాపెడా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వసూలు చేయడం హేయమైన చర్య.
– అలుక కిషన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు
తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది..
కేంద్ర బడ్జెట్ మూలంగా వేతన జీవులకు తీవ్రంగా నష్టం వాటిల్లేలా ఉంది. ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పు చేస్తారని అం తా భావిస్తే.. మోదీ ప్రభుత్వం చేదు వార్తను అందించింది. ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరుగుతున్నది. ఫలితంగా ఖర్చులు అమాంతం ఎగబాకుతున్నాయి. ఈ పరిస్థితిలో ఆదాయ పన్ను పరిమితిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– కె.వేణుగోపాల్, టీపీటీఎఫ్ సీనియర్ నాయకులు
ఉద్యోగులపై పన్ను భారం..
కేంద్ర బడ్జెట్ ఉద్యోగుల అసంతృప్తికి కారణమవుతున్నది. కా ర్పొరేట్ వ్యక్తులు చెల్లించే పన్ను ను ఈ బడ్జెట్లో 3శాతం తగ్గించింది. సామాన్య ప్రభుత్వ ఉ ద్యోగులపై మాత్రం పన్ను ఊరటను కల్పించకపోవడం విడ్డూరం. ఈ బడ్జెట్‌తో కేంద్ర ప్రభుత్వం ఎవరి పక్షమో అర్థమైంది.
– అనిల్, ఉపాధ్యాయ సంఘం నాయకుడు