అర్జున్కృష్ణ, శోభితరానా జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్సమ్మ’. హరి అయినీడి, రమ్య కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. అభిరాజ్ రూపాల, సతీష్ వీఎమ్ దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ క్లాప్‌నిచ్చారు. మస్తాన్ కెమెరా స్విఛాన్ చేశారు. సుబ్బు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ‘మంచి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని ఆకాంక్షించారు. “మిస్సమ్మ’ ఆల్‌టైమ్ క్లాసిక్‌గా చరిత్రలో నిలిచిపోయింది. ఆ క్యారెక్టరైజేషన్ ఆధారంగా సైంటిఫిక్, హిస్టరీ అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నాం. అంతర్లీనంగా చక్కటి ప్రేమకథ మిళితమై ఉంటుంది. మాస్, క్లాస్‌తో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది’ అని నిర్మాతలు తెలిపారు. శివ కంఠమనేని, డీఎస్‌రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్: డేవిడ్ మార్గెల్.