Good News | కుమ్మరి వృత్తి కళాకారులకు ఆధునిక యంత్రాలు
Good News | కుమ్మరి వృత్తి కళాకారులకు ఆధునిక యంత్రాలు | తెలంగాణ రాష్ట్రంలోని కుమ్మరి శాలివాహన కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆధునిక పాటరీ యంత్రాలపై ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 320 మంది వృత్తి కళాకారులకు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని కుమ్మరి శాలివాహన కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆధునిక పాటరీ యంత్రాలపై ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 320 మంది వృత్తి కళాకారులకు యంత్రాలు మంజూరు చేసింది. వీరితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ప్రత్యేక మండలానికి ఒకటి చొప్పున ఆధునిక కుండల బట్టీలను మంజూరు చేసింది. బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
యంత్రాల ద్వారా మట్టి పాత్రలు, మట్టి నీళ్ల కూజాలు, టీకప్పులు, మట్టి విగ్రహాలు, మట్టి దీపకుండీలు, ఇతరత్రా అలంకరణ వస్తువులు వేగంగా చేయడానికి వీలు కలుగనుంది. ప్రభుత్వం నిర్ణయంతో ఒక్కొక్కరికి రూ.లక్ష విలువైన ఆధునిక పాటరీ యంత్రాలు 80వేల సబ్సిడీపై అందనున్నాయి. శిక్షణ పొందిన అనంతరం 320 మంది అభ్యర్థులు తమ వాటాగా రూ.20వేలు జమ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో శాలీవాహన కుమ్మరి కులస్తుల ఆదాయం పెరిగి.. ఆర్థిక స్వావలంభన సాధించేందుకు బాటలు పడనున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

