ఒడిశాలో పోలీసులపై దాడి.. ముగ్గురికి గాయాలు
ఒడిశాలో పోలీసులపై దాడి.. ముగ్గురికి గాయాలు |

భువనేశ్వర్ : ఒడిశా మయూర్భంజ్ జిల్లాలోని శరత్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేబన్బహల్లి గ్రామంలో పలువురు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. అలాగే వాహనాన్ని ధ్వంసం చేశారు. ఘటనలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు గుమిగూడకుండా అడ్డుకోవడంతో దాడి చేశారని ఏఎస్ఐ మహాపాత్ర తెలిపారు. గ్రామంలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడి చైతిపర్బా (చైత్రమాసం పండుగ) జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వైరస్ వ్యాప్తి చెందుతుందని, ఎక్కువగా జనం గుమిగూడవద్దని చెబుతుండగా.. వాహనం ధ్వంసం చేసి, తమపై దాడి చేశారని మహాపాత్ర తెలిపారు.
ఈ ఘటనలో ఏఎస్ఐకి తీవ్ర గాయాలు కావడంతో ఉడాలా సబ్‌డివిజనల్ హాస్పిటల్‌కు.. పరిస్థితి విషమంగా ఉండడంతో బారిపాడ జిల్లా ప్రధాన హాస్పిటల్‌కు తరలించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మే 5 నుంచి రాష్ట్రంలో 14 రోజుల లాక్‌డౌన్‌ను ఒడిశా ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోహపాత్రా జారీ చేసిన ఉత్తర్వుల్లో వారాంతాలు మినహా మిగతా అన్ని రోజుల్లో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని.. లాక్డౌన్ 19 వరకు అమలులో ఉంటుందని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
బీజేపీ హిందుత్వను హైజాక్ చేసిన మమత, స్టాలిన్, విజయన్
కమలానికి కర్రుకాల్చి వాత
కాంగ్రెస్ కథ ముగిసినట్టే!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

