అబిడ్స్, డిసెంబర్ 12: రాష్ట్రంలో కురుమలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెగ్గె మల్లేశం పేర్కొన్నారు. కురుమల దసరా, దీపావళి సమ్మేళనాన్ని పురస్కరించుకుని చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లో స్పోర్ట్స్ మీట్-2021ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కురుమ సంఘం నాయకులు కేజీ. కృష్ణమూర్తి, జీహెచ్ఎంసీ మాజీ స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రేమ్‌రాజ్, నర్స వినోద్‌కుమార్, ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కెండ్యాల శ్రీనివాస్, హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ కొలుపుల నరసింహ, సభ్యులు దేవర రాజేశ్వర్, వస్పరి శంకర్, రాచూరి మల్లేశం, ప్రకాశ్, కొంగళ్ల విమల్, కట్టా మల్లేశం, ఎక్కాల కన్న, కొండల్ రాజు, తూముకుంట అరుణ్‌కుమార్, కాలె అమర్నాథ్, ఆర్.సుధాకర్, సి.మధు, రజేందర్, రాఘవేంద్ర, తమగొండ బాలమణి, మిర్యాల విజయ తదితరులు పాల్గొన్నారు.