Vijayashanti | కాంగ్రెస్ పాలనలో(Congress rule) మహిళలకు రక్షణ లేదు అని సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రాజ్ కుమార్ బెయిల్పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. రాజ్ కుమార్ దగ్గర లంచం తీసుకుని పోలీసులు విడుదలకు సహకరించారన్న విషయం తెలిసి షాక్కు గురయ్యానని తెలిపారు. పోలీసులు చేసిన తప్పుతో నిందితుడు ఆరుగురి ప్రాణాలను కడతేర్చాడని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి, మహిళల శాంతి, భద్రతలను కాపాడాలని విజయశాంతి కోరారు. కాగా, సొంత పార్టీకే చెందిన ఓ మహిళా నాయకులురాలు రాష్ట్రంలోని మహిళల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అసమర్ధ పాలన వల్లే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హోంమంత్రి మరొకరి కేటాయించి శాంతి భద్రతలను కాపాడాలని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.