హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): అమ్మ ప్రేమ ఇప్పటికీ ఎప్పటికీ పదిలమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆదివారం ఆమె భావోద్వేగంతో ట్వీట్చేశారు. 20 ఏండ్లనాటి అమ్మ చీర కట్టుకొని తన్మయత్వానికి లోనయ్యారు. సాంకేతికత ఎంత పెరిగినా, పద్ధతులు ఎన్ని మారినా, సంప్రదాయం గొప్పదనం ఎప్పటికీ పదిలమేనని ట్విట్టర్లో తెలిపారు. తరాలుమారినా అమ్మ ప్రేమ తరగదని, తగ్గదని పేర్కొన్నారు.