అలంపూర్ : జోగుళాంబ ( Jogulamba ) బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు (MLA Vijayudu) దర్శించుకున్నారు. ఆషాడ మాసం చివరి శుక్రవారం సందర్భంగా శాకాంబరి దేవి (Sakambari Devi) అలంకారంలో భక్తులకు దర్శనమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగులాంబ దేవి అమ్మవారు ,శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి దర్శించుకుని పూజలు చేశారు.
అధికారులు, అర్చకులు,ఆలయ ఈవో పురెందర్ కుమార్ ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను శేష వస్త్రాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులకు స్వామి, అమ్మవార్ల ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.