వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం సుదర్శన్ ఇంట్లో చోరీ జరగడంతో ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం సంఘటనకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. జరిగిన సంఘటనపై స్థానికులను, బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఇంట్లో బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు చోరీకి గురికావడంతో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, దొంగలను పట్టుకోవడానికి కృషి చేయాలని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.