షాద్నగర్టౌన్, ఆగస్టు 29 : షాద్నగర్ మున్సిపాలిటీలోని శ్రీసాయిబాలాజీ టౌన్షిప్లో అమృత్ పథకంలో భాగంగా రూ.76లక్షలతో చేపట్టనున్నా వాటర్ పైప్లైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీని మరింత సుందరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు.
శ్రీసాయిబాలాజీ టౌన్షిప్లో విద్యుత్, మురుగుకాలువ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని, సీసీరోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ఖాన్, నాయకులు తిరుపతిరెడ్డి, రఘు, శివశంకర్, ముబారక్, మురళీమోహన్, ప్రవీణ్, శ్రీకాంత్, ఖదీర్, మాధవులు, కరుణాకర్, రవితేజ, దిలీప్, శ్రీధర్, కాలనీవాసులు పాల్గొన్నారు.