హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అసెంబ్లీలో ప్రస్తావించారు. వీటిని అరికట్టడంలో సీడ్స్ కార్పొరేషన్ విఫలమైందని అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన సబ్సిడీ ఇచ్చి కూరగాయల సాగును ప్రోత్సహించాలని సూచించారు.
ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతారావు, కడియం, కసిరెడ్డి , గండ్ర ఆయిల్‌పామ్‌పై పలు ప్రశ్నలు సంధించారు. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు ఎకరాకు రూ. 46,250 వరకు ప్రోత్సాహకం అందిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు.