MLA Talasani | ఓటర్ల హక్కుకు భంగం కలిగించేలా ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఉన్నాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్లో గల బెల్వర్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) లో ఎన్నికల కమిషన్ బాధ్యతగా వ్యవహరించలేదని విమర్శించారు. బీఎల్వోలను కార్యక్రమంపై సరైన అవగాహన లేని వారిని నియమించారు. అనేక చోట్ల గందరగోళం నెలకొని లక్షల మంది ఓట్లు తొలగించబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటరు నమోదు ఎందుకు ? కొత్త ఓటర్ల వరకే పరిమితం చేయాలని సూచించారు.