ఇల్లందకుంట : ఉస్మానియా ఉద్యమ కెరటం, చదువుకున్నయువకుడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆయన శనివారం ఇల్లందకుంట మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…యువత టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని, ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసారో ఇప్పటి వరకు చెప్పలేదని అన్నారు. ఆసరా పెన్షన్లు, స్వంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం తరపున రూ.5లక్షల సాయం అందిస్తామని అన్నారు.
యువతకు ప్రభుత్వం తరపున 1లక్ష32వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే మరో 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకం పని చేస్తుంది.ఏడు సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులను ఇప్పుడు ఉన్న అభివృద్ధి పరిస్థితులను గమనించాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను చూసి సరిహద్దు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాన్ని తెలంగాణ లో కలపాలని కోరుతున్నారని సుంకె రవిశంకర్ అన్నారు. ఈ సందర్భంగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కూడా) చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.