జగిత్యాల : నేత్ర వైద్యుడైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కంటి పరీక్షలు చేశారు. మంత్రి గొల్లపల్లి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే సంజయ్ నివాసానికి వెళ్లారు. పలు సమస్యలపై చర్చించారు. ఇంటి పక్కనే ఉన్న సంజయ్‌కు చెందిన నేత్ర వైద్యశాలలో పరీక్షలు చేయించుకున్నారు. కాగా, మంత్రికి ఎలాంటి దృష్టి సంబంధ సమస్యలు లేవని సంజయ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
రైతులకు సాగునీటి సమస్యలు రానీయొద్దు
కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పంచలోహ విగ్రహాల దొంగల అరెస్ట్