BJP MLA Raghunandan | దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వర్ధరాజ్ పల్లిలో సోమవారం రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రఘునందన్ రావు ప్రచారం ముగించుకుని వెళుతుండగా బీజేపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రజల మధ్యే పటాకులు కాల్చారు.
దీంతో వర్దరాజ్ పల్లి గ్రామ వాసి మస్కురి మల్లవ్వ మీద పడటంతో బట్టలు కాలిపోయి, గాయాలయ్యాయి. దీంతో మల్లవ్వను హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలిసినా ఎమ్మెల్యే ఆగకుండా వెళ్ళిపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రఘునందన్ రావుకు రాజకీయాలు ఎక్కువయ్యాయని స్థానికులు మండి పడ్డారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో ఇలా ఉంటే, గెలిస్తే నువ్వను పట్టించుకుంటావా రఘునందన్ అని ప్రశ్నిస్తున్నారు.