మణికొండ, డిసెంబర్ 10: మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోకాపేటకు చెందిన దంపతు లు దుర్గం రాజు, దుర్గం మౌనికలు మృతి చెందగా, ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిన విషయం తెలిసిం దే.. ఈ ఘటనపై చలించిన నార్సింగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ సభ్యురా లు అలివేలు మంగ దంపతులు చిన్నారులలో పెద్ద కూ తురైన చంద్రిక(6)ను పూర్తి స్థాయిలో చదివించేందుకు ముందుకు వచ్చారు. ఎంత వరకు చదివినా అవసరమైన ఖర్చులను వెచ్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు.
చిన్నారుల భవిష్యత్తుకు ముందుంటామన్నారు. అదే విధంగా మిగిలిన ఇద్దరు కుమారులను ఆర్థికంగా ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని వారు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం చిన్నారులకు తక్ష ణ సహాయార్థం చంద్రశేఖర్‌రెడ్డి, అలివేలు మంగ దంపతులు రూ.35 వేల నగదును స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా అం దించారు.
పిల్లల భవిష్యత్తును దృష్టి లో ఉంచుకుని సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి, అలివేలు మంగలను ఎ మ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. తన వంతుగా చిన్నారులకు ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలను అందించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, మాజీ ఎంపీపీ మల్లేష్, నర్సింహా, హరి శంకర్, రాజేశ్ యాదవ్, కుమార్, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.