జిన్నారం : మంత్రి హరీశ్ రావు జన్మదినం సందర్భంగా మండల కేంద్రం జిన్నారంలోని రైతు వేదిక ఆవరణలో ఐదుగురు వికలాంగులకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ. ఆరు లక్షల విలువైన 5 స్కూటీ లను అందజేశారు.
మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దేవున్ని ప్రార్థిస్తున్నామన్నారు.
ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్, ఎంపీడీవో రాములు, పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.