బంజారాహిల్స్,డిసెంబర్ 14: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ స్టాం డింగ్ కౌన్సిల్ సభ్యుడు సీఎన్ రెడ్డి, కార్పొరేటర్లు బాబా ఫసీయుద్దీన్, రాజ్‌కుమార్ పటేల్, దేదీప్యరావు, సంగీత యాదవ్‌తో పాటు పలు డివిజన్ల కార్యకర్తలు బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎదురులేదనే విషయం మరోసారి వెల్లడైందన్నారు. ఇకనైనా ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయాలు మాని ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడాలని సూచించారు.
అమీర్‌పేట్, డిసెంబర్ 14 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబురాల్లో అమీర్‌పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేషుకుమారి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు. కార్యక్రమంలో అమీర్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సంతోష్ మణికుమార్‌తో పాటు పార్టీ నాయకులు కరుణాకర్‌రెడ్డి, నారాయణరాజు, కట్టా బలరామ్, బాసా లక్ష్మి, సురేందర్‌గౌడ్ పాల్గొన్నారు.