MLA Krishna Rao | బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలి : ఎమ్మెల్యే కృష్ణారావు
MLA Krishna Rao | తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేండ్ల కాలంలో రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్(BRS )పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి భారీ మెజారిటీని అందించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao), ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్ కోరారు.
కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 20 : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేండ్ల కాలంలో రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్(BRS )పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి భారీ మెజారిటీని అందించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao), ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్ కోరారు.
బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్ధతుగా నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందిందన్నారు.
తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరం ఆదర్శవంతంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు. గత ఎన్నికలలో కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ ఏకపక్షంగా తీర్పునిచ్చి బీఆర్ఎస్ పార్టీకి 70 వేలకు పైగా మెజార్టీని అందించారని, రానున్న ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీని ఆదరించి భారీ మెజార్టీని అందించాలని కోరారు. కాలనీలు, బస్తీలలో ప్రజలను కలుస్తూ కారు గుర్తుకు ఓటేసేలా ప్రచారం చేయాలన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

