బూర్గంపహాడ్, ఆగస్టు 18 : బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ఏజీహెచ్ఎస్ ఆశ్రమ పాఠశాల వద్ద చేతిపంపు మరమ్మతుకు గురికావడంతో స్పందించిన సర్పంచ్ మందా నాగరాజు సిబ్బందిచే మంగళవారం మరమ్మతులు చేయించారు. చేతిపంపు పాడైందని వార్డెన్ పద్మావతి సోమవారం సర్పంచ్‌కు ఫిర్యాదు చేయడంతో విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు కలగకూడదని తక్షణమే స్పందించి సర్పంచ్ సిబ్బందిచే పాడైన చేతిపంపుకు మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.