MLA Vivekananda | కాలనీల అభివృద్ధికి సహకారం అందిస్తాం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని బీఆర్ఎస్ ఎల్పీవిప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
కుత్బుల్లాపూర్,ఫిబ్రవరి2 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని బీఆర్ఎస్ ఎల్పీవిప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేస్-1లో రూ.43 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లతో పాటు రూ.4.50 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలను స్థానిక మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 12 ఏళ్ల కాలంలో పద్మానగర్ ఫేస్-1కాలనీని మౌలిక వసతుల కల్పనలో ఒక ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు.
కాలనీ సంక్షేమ సంఘం నిరంతరం కాలనీ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తూ అభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తామని కాలనీ అభివృద్ధికి తనవంతు సంపూర్ణ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏఈ రవి, ఎస్ఐ ఏ.వినోద్‌కుమార్, కాలనీ అధ్యక్షులు సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి ప్రసాద్‌రావు, కిశోర్‌చారి, పప్పిరెడ్డి, సురేందర్‌రెడ్డి, శ్రీనాథ్, కళ్లెం శ్రీనివాస్‌గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

