కాచిగూడ,డిసెంబర్ 16: నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. గురువారం కాచిగూడ డివిజన్లోని మోతీమార్కెట్లో రూ.14 లక్షలు, కాచిగూడ ఎక్స్‌రోడ్డు వద్ద రూ.13 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన తాగునీటి పైప్‌లైన్ పనులను కార్పొటర్ ఉమాదేవితో కలిసి ప్రారంభించారు. అనంతరం బస్తీలో ఎమ్మెల్యే పర్యటించి నీటి, డ్రైనేజీ సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. నీటి కాలుష్య సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు బస్తీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పే ర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించనున్నట్లు తె లిపారు.
కార్యక్రమంలో మాజీ ఫ్లోర్‌లీడర్ దిడ్డి రాం బాబు, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్ర భీష్మదేవ్, కన్నె రమేశ్‌యాదవ్, సునీల్బిడ్లాన్, డాక్టర్ శిరీషాయాదవ్, బద్దుల రవీందర్‌యాదవ్, డాక్టర్ ఓం ప్రకాశ్‌యాదవ్, కృష్ణాగౌడ్, జలమండలి జీఎం మహేశ్, డీజీఎం సన్యాసిరావు, మేనేజర్ భావన, దాత్రిక్ నాగేందర్బాబ్జి, బండారు సంతోశ్‌కుమార్,రమాదేవి, బబ్లూ, నాగరాజుగౌడ్, మన్నె శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌యాదవ్, రాజేశ్, శ్రీకాంత్‌యాదవ్, సుభాశ్పటేల్, క్షీర్సాగర్, రవియాదవ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.