Gadari Kishore : తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ (Gadari Kishore) జన్మదిన వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఉస్మానియా ఉద్యమ కెరటమైన గాదరి కిశోర్ నివాసంలో నిర్వహించిన పుట్టినరోజు పార్టీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షమయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భారత్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
గాదరి కిశోర్ జన్మదిన వేడుకల్లో జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ గజ్జ యుగంధర్ రావు, రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహ రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాము, తదితరులు పాల్గొన్నారు.
