వనస్థలిపురం, డిసెంబర్ 17 : యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని రాణించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ వైదేహినగర్లో నిర్మించిన నైట్ ట్రైన్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియాన్ని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయన్నారు. క్రీడాకారులు ఎంతో ఆరోగ్యంగా ఉంటారన్నారు. పిల్లల ఆసక్తిని బట్టి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు దామోదరెడ్డి, హన్మంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, అనిల్ చౌదరి, ప్రణీత్, మెట్టుపల్లి సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్, డిసెంబర్ 17: మన్సూరాబాద్ డివిజన్ చంద్రపురికాలనీలో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం కాలనీ గౌరవ అధ్యక్షుడు, మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు రుద్ర యాదగిరి ఆధ్వర్యంలో ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. చంద్రపురికాలనీలో అంతర్గత రోడ్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి రుద్ర యాదగిరి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీల్లో రోడ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ విజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు పోచబోయిన జగదీశ్‌యాదవ్, జక్కిడి రఘువీర్ రెడ్డి, అత్తాపురం రాంచంద్రారెడ్డి, సీహెచ్ బాలరాజు గౌడ్, పారంద నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.