వనస్థలిపురం, డిసెంబర్ 16: ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. వనస్థలిపురానికి చెందిన గీత మోకాళ్ల సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. చికిత్సకు అధికంగా ఖర్చు అవుతుండడంతో ఎమ్మెల్యేను సంప్రదించారు. ఆయన సిఫారసుతో సీఎం సహాయనిధికి దరకాస్తు చేసుకున్నారు. దీంతో వారికి రూ.2.50 లక్షలు మంజూరయ్యాయి. ఆ చెక్కును గురువారం బాధితురాలి భర్త మధుసూదన్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, శ్రీనివాస్, సుమంత్ పాల్గొన్నారు.