168 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్, డిసెంబర్ 14: పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్న సీఎం కేసీఆర్ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 168 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డ వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా చేయూతను అందిస్తున్న సీఎం కేసీఆర్ పేదల పెద్దన్నగా మారారన్నారు.
ప్రజా సంక్షేమ పాలనలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు అండదండగా తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. సీఎం కేసీఆర్ న్యాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్ తాసీల్దార్ రామ్మోహన్‌తో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.
చంపాపేట, డిసెంబర్ 14: ఆలయ అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధి కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయానికి ఆలయ మాజీ డైరెక్టర్ బసిగూడెం జంగారెడ్డి హారిక దంపతులు మంగళవారం రూ.6లక్షల విలువ చేసే 12చౌఖీలు, 13 టేబుల్స్‌ను ఎమ్మెల్యే సమక్షంలో ఆలయ కార్యనిర్వహణాధికారి దీప్తికి విరాళంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, మాజీ ధర్మకర్తలు చేగోని మల్లేశ్‌గౌడ్, చెలమల యాదిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, చంపాపేట డివిజన్ టీఆర్ఎస్ నాయకులు మేక సురేందర్‌రెడ్డి, గోగు శేఖర్‌రెడ్డి, కొత్తపేట ప్రభాకర్, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గీతా జయంతి మహోత్సవ్ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పద్మిని ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేతుల మీదుగా పుస్తకాలను అందజేశారు.