ఎల్బీనగర్, డిసెంబర్ 13: కాలనీల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ‘మీతో మీ ఎమ్మెల్యే’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులు చేసిన కాలనీల వాసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. సమస్యలను ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్‌తో పాటుగా ఇతర మాధ్యమాల ద్వారా తెలియజేయాలని కోరామని, దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కారం చేయడంతో పాటు పెద్ద పెద్ద సమస్యలపై అధికారులను ఆయా కాలనీలకు పంపించి ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నామన్నారు.