మియాపూర్, డిసెంబర్ 14 : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా డివిజన్లకు చెందిన 17 మందితో పాటు మియాపూర్, హఫీజ్‌పేట్ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి పథకం కింద మంజూరైన రూ. 22.50 లక్షల చెక్కులను విప్ అరెకపూడి గాంధీ మంగళవారం తన నివాసంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధితో పేదలకు ఆరోగ్యంపై భరోసా నెలకొంటున్నదని తెలిపారు.
ప్రభుత్వ ఆర్థిక సాయంతో కార్పొరేట్ వైద్యంతో పేదలు పూర్తి స్వస్థత పొందుతున్నారన్నారు. పేదలకు అండగా నిలుస్తూ ఆపదలో ఆపన్న హస్తాని ఈ పథకం అందిస్తున్నదని విప్ గాంధీ పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు వీలైనంత త్వరగా సహాయం అందించేందుకు తాను సైతం అధికారులతో ఎప్పటికపుడు సమీక్షిస్తున్నట్లు విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా, ఆదర్శ్‌రెడ్డి, సాంబశివరావు, శ్రీను, కాశీనాథ్, అనీల్, చంద్రమోహన్, శ్రీనివాస్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి,మియాపూర్ డిసెంబర్ 14: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ బాధితులకు న్యాయం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్లను గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మంగళవారం కలెక్టరేట్లో కోరారు. బసవతారక నగర్లో ఇటీవల ఇళ్లు కోల్పోయిన బాధితులకు సరైన న్యాయం చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణ పథకాలలో వెంటను లబ్ధి చేకూర్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అదేవిధంగా బాధితులందరికీ తాత్కాలికంగా సదుపాయాలు కల్పించి వారికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు పల్లపు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.