క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిథాలీ రాజ్
హైదరాబాద్: ప్రఖ్యాత మహిళా క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా ఆమె పేరిట రికార్డు ఉంది. ఇండియా తరపున మిథాలీ మొత్తం 232 మ్యాచ్‌లు ఆడింది. 50.68 సగటుతో ఆమె 7805 రన్స్ స్కోర్ చేసింది. ఇన్నాళ్లూ తన పట్ల ప్రేమను, అభిమానాన్ని ప్రదర్శించిన వారందరికీ ఆమె తన ట్విట్టర్లో థ్యాంకూ చెప్పారు. మీ అందరి ఆశీస్సులు, మద్దతుతో రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు మిథాలీ తన ట్వీట్లో తెలిపారు.
మిథాలీ సుమారు 23 ఏళ్ల పాటు ఇండియా జట్టు తరపున ఆడారు. టీమిండియా మహిళల జట్టు కెప్టెన్‌గా చేశారు. ఇండియాను గెలిపించాలన్న ఉద్దేశంతోనే ప్రతి మ్యాచ్‌లోనూ పట్టుదలతో ఆడినట్లు తన ట్వీట్లో మిథాలీ తెలిపారు.
Thank you for all your love & support over the years!
I look forward to my 2nd innings with your blessing and support. pic.twitter.com/OkPUICcU4u— Mithali Raj (@M_Raj03) June 8, 2022
1999లో ఎంట్రీ..
1999 జూన్‌లో మిథాలీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన వన్డేలో ఆమె అరంగేట్రం చేశారు. ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్‌లో ఆమె భారత జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టారు. 2017లో మిథాలీ నేతృత్వంలోని మహిళల జట్టు ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో ప్రవేశించింది. ఆ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో స్వల్ప తేడాతో ఇండియా ఓడిపోయింది. 2005 వరల్డ్ కప్‌లోనూ ఇండియా జట్టుకు మిథాలీ పగ్గాలు చేపట్టింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా పరాజయం చవిచూసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

