Mirai | తేజా సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్‌గా నటించిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో శ్రియ శరన్ తల్లిగా, రితిక నాయక్ హీరోయిన్గా నటించారు. మరోవైపు జగపతి బాబు, జయరామ్, గెటప్ శ్రీను, కిషోర్ తిరుమల తదితరులు కీలక పాత్రలు పోషించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్ – కృతి ప్రసాద్ నిర్మించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిరాయ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 27.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన సమాచారం ప్రకారం, రెండో రోజు ‘మిరాయ్’ మరింత ఊపు మీద ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పాన్ ఇండియా లెవెల్లోనూ ‘మిరాయ్’కు శనివారం కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు నెట్ కలెక్షన్స్ ₹13 కోట్లు కాగా, రెండో రోజు ₹13.70 కోట్లు రాబట్టినట్టు తెలుస్తుంది. అంటే రెండో రోజు ఓపెనింగ్ డే కంటే ఎక్కువ వసూళ్లు వచ్చినట్టు స్పష్టమవుతోంది. భాషల వారీగా వసూళ్లు చూస్తే.. తెలుగు ₹11 కోట్లు, తమిళం ₹10 లక్షలు, కన్నడ, మలయాళం లో తలో ₹5 లక్షలు వసూళ్లు రాబట్టింది. హిందీలో చూస్తే తొలి రోజు ₹1.65 కోట్లు, రెండో రోజు ₹2.5 కోట్లు (అల్మోస్ట్ 50% గ్రోత్) వసూళ్లు వచ్చాయి. హిందీ బెల్ట్‌లోనూ ‘మిరాయ్’ సెకండ్ డే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయడం విశేషం. మంచి మౌత్ టాక్ సినిమా వసూళ్లను మరింతగా పెంచింది.
నార్త్ అమెరికాలో ‘మిరాయ్’ తొలి రోజు సుమారు $700K వసూలు చేయగా, రెండో రోజు మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. యూఎస్, కెనడాలో NRI ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చారు. ఓవర్సీస్ మార్కెట్లో సినిమాకు సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ₹27.20 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు కూడా అదే స్థాయిలో రాబట్టినట్లు అంచనాలు. దీంతో రెండు రోజుల్లో టోటల్ గ్రాస్ వసూళ్లు ₹50 కోట్లు దాటేశాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఫస్ట్ వీకెండ్ ముగిసేలోపు ₹100 కోట్ల మార్క్ దాటడం ఖాయమని చెబుతున్నారు. “మిరాయ్ ఈ వారం ముగిసేలోపు 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. వచ్చే వారంలో 150 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని జోస్యాలు చెబుతున్నారు.