Mirai | తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిరాయ్’ సినిమా తెలుగు ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ మూవీ మంచి కలెక్షన్స్ దక్కించుకుంటుంది. తొలి రోజు రూ. 27.2 కోట్లు వసూళ్లు రాబట్టగా, రెండో రోజు రూ.28.4 కోట్లు, మూడో రోజు రూ.81.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. వారాంతం వరకు ‘మిరాయ్’ రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. కథ, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రేక్షకులు విశేషంగా చర్చిస్తున్నారు.
అయితే సినిమా విజయం మధ్యలోనే సోషల్ మీడియాలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. నెటిజన్ రవి వల్లభనేని ట్వీట్ చేస్తూ.. ‘మిరాయ్’ సినిమా 1969లో విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘మహాబలుడు’ సినిమా మక్కీకి మక్కీ కాపీలా ఉంది అని కామెంట్ చేశారు. అంతే కాదు, ఆ సినిమా యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేశారు. దీంతో ఈ అంశం వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు “మిరాయ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శిష్యుడిలా ఉన్నాడు అని అంటుండగా, మరి కొందరు మహాబలుడు, మిరాయ్లకు ఎలాంటి పోలిక లేదు. కథ, క్యారెక్టర్స్, సెంటిమెంట్ వేరు. ఇది కేవలం బురద జల్లడమే అని కొట్టిపారేస్తున్నారు.
వివాదం ఒక వైపు కొనసాగుతుంటే, మరో వైపు సినీ ప్రముఖులు మాత్రం ‘మిరాయ్’ ని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. “మిరాయ్లోని VFX షాట్స్ రూ.400 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాల కంటే కూడా బెటర్‌గా ఉన్నాయి” అని ప్రశంసించారు. మంచు మనోజ్ విలన్‌గా నటించడం తప్పు అనుకున్నానని, కానీ సినిమా చూసిన తర్వాత తనకే తానే చెంపదెబ్బలు కొట్టుకున్నానని సరదాగా ట్వీట్ చేశారు. మొత్తానికి ‘మిరాయ్’ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తూనే, కాపీ వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కానీ పాజిటివ్ టాక్, భారీ కలెక్షన్ల దూకుడు చూస్తుంటే, ఈ మూవీ విజయాన్ని ఏ వివాదం ఆపలేనట్టే కనిపిస్తోంది.
మిరాయ్ సినిమా చాలా అద్భుతంగా తీశారు. కానీ సినిమా మొత్తం చూస్తే 18/04/1969 హీరో కృష్ణ నటించిన మహాబలుడు సినిమాని మక్కీకి మక్కీ దించినట్టు కనబడడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది. సినిమా లింక్ https://t.co/IoMlGzL3ob
— Ravi Vallabhaneni (మహానాడు 2025) (@ravivallabha) September 14, 2025