ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా సమీర్ దాస్ అనే హిందూ ఆటో డ్రైవర్‌ను దుండగులు కొట్టి చంపారు. చిట్టగాంగ్‌లోని దగన్భునియా అనే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమీర్‌ను కొందరు దుండగులు చితకబాది అనంతరం కత్తితో పొడిచి చంపారు.
అనంతరం అతడి ఆటోతో పరారయ్యారు. బంగ్లాదేశ్‌లో ఇటీవలి కాలంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.