బ్రిక్స్ దేశాల సంప్రదాయ ఔషధ ఉత్పత్తుల నియంత్రణ పై వెబ్‌నార్..

ఢిల్లీ ,జూన్ 4: బ్రిక్స్ దేశాల సంప్రదాయ ఔషధ ఉత్పత్తుల ప్రామాణీకరణ నియంత్రణ స్థిరీకరణపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబ్‌నార్ నిర్వహించింది. భారత్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ వెబినార్‌లో భారత్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా, బ్రెజిల్ దేశాల సంప్రదాయ ఔషధ రంగాలకు చెందిన నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత వెబినార్ నిర్వహణ కోసం, ఈ ఏడాది ఫిబ్రవరి 24-26 తేదీల్లో జరిగిన సమావేశంలోనే భారత్ ప్రతిపాదించగా, సభ్య దేశాలు అంగీకరించాయి. “సంప్రదాయ ఔషధ రంగంలో బ్రిక్స్ నిపుణులు” పేరిట ఈ ఏడాది మార్చి 25న కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ వర్చువల్ సమావేశం నిర్వహించింది.
ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారుడు డా.మనోజ్ నేసరి ఈ వెబినార్‌కు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బ్రిక్స్ దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, సంప్రదాయ వైద్య రంగంలో “భారతదేశ బ్రిక్స్ 2021” ప్రాధాన్యతలను డా.నేసరి వివరించారు. భారత్ చేసిన ప్రతిపాదనల్లో, ‘సంప్రదాయ ఔషధ రంగంలో బ్రిక్స్ సహకారంపై అవగాహన ఒప్పందం’, ‘సంప్రదాయ ఔషధాలపై బ్రిక్స్ ఫోరం'(బీఎఫ్టీఎం)ఏర్పాటువంటి అంశాలు ఉన్నాయి
బ్రిక్స్ దేశాల మధ్య సంప్రదాయ ఔషధ ఉత్పత్తుల ప్రామాణీకరణ నియంత్రణ స్థిరీకరణ అవసరాన్ని డా.నేసరి స్పష్టం చేశారు.ఆయుష్ ఔషధాల ద్వారా కొవిడ్‌ను నియంత్రించడానికి భారత్ తీసుకున్న చర్యలను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు.బ్రిక్స్ దేశాలతోసహా ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ ఔషధాలను ప్రోత్సహించడానికి భారత్ చేపట్టిన ప్రయత్నాల బ్రిక్స్ దేశాల సంప్రదాయ వైద్య రంగ నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులుప్రశంసించారు.ఈ విషయంలో సహకారం,మద్దతును అందిస్తామని ప్రకటించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

