అమీర్‌పేట్, డిసెంబర్ 14 : సనత్‌నగర్ సుభాశ్‌నగర్‌కు చెందిన స్వరూప ఇటీవల అనారోగ్యానికి గురైంది. భర్త సుదర్శన్‌రెడ్డి చిరుద్యోగి కావడంతో వైద్య ఖర్చులు భారమయ్యాయి. ఈ పరిస్థితుల్లో సమీఉల్లా బస్తీకి చెందిన స్వరూప అనారోగ్య పరిస్థితిని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సురేశ్‌గౌడ్ ద్వారా మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి వెంటనే స్పం దిస్తూ సిఫారసు చేయగా మంజూరైన రూ. 2 లక్షల ఎల్వోసీ పత్రాన్ని మంగళవారం సుదర్శన్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దీంతో మంత్రి తలసానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బంజారాహిల్స్: అనారోగ్యంతో బాధపడుతున్న రహ్మత్‌నగర్ డివిజన్ కార్మికనగర్‌కు చెందిన ఖలీముద్దీన్ చికిత్స కోసం సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా మంజూరైన రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.