కందుకూరు, డిసెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అభివృద్ధికి కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. మంగళవారం మండల పరిధిలోని దన్నారం గ్రామంలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని చూసి తమ ఉనికి కోల్పోతుందని అర్థంలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిపక్షాల విమర్శలను తిప్పకొట్టాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, ఎంపీటీసీ సురుసాని రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీదేవి, శేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు సురేందర్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, డైరెక్టర్లు పాండురంగారెడ్డి, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్‌రెడ్డి, పాండు, టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, బీసీ విభాగం నాయకులు పాండుగౌడ్, బర్కం వెంకటేశ్, గుయ్యని సామయ్య, కాసోజు ప్రశాంత్‌చారి, జయమ్మ రాజు,పాల్గొన్నారు.
మండల పరిధిలోని దన్నారం గ్రామంలో జరిగిన ఇరుముడి పూజలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు కందుకూరుకు వస్తున్నట్లు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క జంగారెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం 11గంటలకు కందుకూరులో టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో 101 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారని తెలిపారు. అనంతరం కొత్తగూడ గ్రామంలో అయ్యప్ప ఇరుముడి పూజలో పాల్గొంటారని తెలిపారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీటీసీ మంద జ్యోతి పాండు హాజరవుతారని తెలిపారు.