మహేశ్వరం, డిసెంబర్ 23: తెలంగాణలో కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిరాల చెరువులో రొయ్య పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు వారికి పనిముట్లు అందజేస్తున్నారన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎన్నో కొత్త కంపెనీలు వస్తున్నాయన్నారు. గొల్లకురుమలకు గొర్లు, గంగపుత్రులకు చేపలు పంపిణీ చేస్తున్నామన్నారు.
రాష్ట్రం సిద్ధించిన తర్వాత అన్ని కులాల వారికి సమానంగా సంక్షే మ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. రావిరాల చెరువులో 2.65 లక్షల రొయ్య పిల్లలు వదిలినట్లు పేర్కొన్నారు. చెరువులో కంపెనీల నుంచి వెలువడే కలుషిత నీరు కలువకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రావిరాల చెరువులో చేపలతోపాటు రొయ్యలు కూడా పెంచుతున్నట్లు తెలిపారు. చేపలు పట్టే వారు మార్కెటింగ్ చేసుకునేలా టూవీలర్, ఫోర్‌వీలర్లు పంపిణీ చేయనున్నామన్నారు.
కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ కాంటెకార్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీ వెంకట్‌రెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, జిల్లా మత్స్యశాఖాధికారి సుకీర్తి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు జిల్లెల లక్ష్మ య్య, యూత్ అధ్యక్షుడు సామ్యుల్ రాజు, మహిళా అధ్యక్షురాలు పద్మాభాస్కర్రెడ్డి, కౌన్సిలర్లు బోధ యాదగిరిరెడ్డి, రెడ్డిగళ్ల సుమన్, మహేశ్వరం సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు పరిగి సుధాకర్‌రెడ్డి, బూడిద శ్రీకాంత్‌గౌడ్, రావిరాల మత్స్యకారుల సంఘం నాయకులు గణేశ్, సుదర్శన్ పాల్గొన్నారు.
పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరా అవుతున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీలోని ఇమామ్ గూడకు చెందిన శ్రీనివాస్‌కు మంజూరైన రూ.60 వేల చెక్కును మంత్రి అందజేశారు.
కోళ్లపడకల్‌లో అయప్ప 18వ మహాపడి పూజను టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్ ఆధ్వర్యంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, మాజీ మండల అధ్యక్షుడు చంద్రయ్య, పాల్గొన్నారు.
కందుకూరు, డిసెంబర్ 23: జనార్దన్ గురుస్వామి ఆధ్వర్యంలో టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హలులో యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కార్తీక్ ఆధ్వర్యంలో గురుస్వాములు రామకృష్ణాచారి, ధనంజయ చారి సమక్షంలో నిర్వహించారు. మంత్రి సబితారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాధ్రెడ్డి, నాయకులు చిర్ర సాయిలు, లక్ష్మీనర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, సామ య్య, సత్యనారాయణ, సామ మహేందర్‌రెడ్డి, కృష్ణరాంభూపాల్‌రెడ్డి, పొట్టి ఆనంద్, ఇందిరమ్మ దేవేందర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ప్రశాంత్‌చారి, మోహన్‌రెడ్డి, జయమ్మ, రాజు పాల్గొన్నారు.