కందుకూరు, డిసెంబర్ 22 : గుమ్మడవెల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవీలాల్ ఆధ్వర్యంలో అయ్యప్పల పడిపూజలు వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు, శ్రీనివాస్‌గౌడ్, రాజు ముందుగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేశారు. అనంతరం అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఇరుముడి పూజలు నిర్వహించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, కృష్ణ రాంభూపాల్‌రెడ్డి, సర్పంచ్ ప్రభాకర్ పాల్గొని దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, సురేందర్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ బాబు, సదానంద్‌గౌడ్, రవి, గురు స్వాములు, నరేందర్, సురేశ్, ఈశ్వర్, దినేశ్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
మహేశ్వరం, డిసెంబర్ 22: రామచంద్రగూడ, మాన్సాన్పల్లిలో బుధవారం అయ్యప్ప మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజునాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, నాయకులు కూన యాదయ్య, కరుణాకర్‌రెడ్డి, వీరనాయక్, కంది రమేశ్, వర్కల యాదగిరి గౌడ్, ఉప సర్పంచ్ బూరమోని నర్సింహా యాదవ్, మాజీ సర్పంచ్ మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బడంగ్‌పేట/పహాడీషరీఫ్, డిసెంబర్ 22: పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా వైకుంఠ ధామాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయిస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడలో బుధవారం వైకుంఠ ధామాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, దుర్గాదీప్‌లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్లు ఇబ్రాం శేఖర్, తీగల విక్రంరెడ్డి, జల్పల్లి చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ పర్హాన నాజ్, కార్పొరేటర్ సిద్దాల లావణ్య బీరప్ప, టీఆర్ఎస్ నాయకులు యూసుఫ్ పటేల్, ఖైసర్బామ్, భూపాల్‌రెడ్డి, కామేశ్‌రెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్లు మహేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎస్సైలు నాగరాజు, సైదులు, లింగస్వామి, ప్రభాకర్ పాల్గొన్నారు.