బడంగ్‌పేట, డిసెంబర్ 13: గడప గడపకు తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అందుకు సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెల్‌గూడలో రూ. 1.98 కోట్ల నిధులతో పైపులైన్ల ఏర్పాటుకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో 13 రిజర్వాయర్లను ఏ ర్పాటు చేయనున్నామని తెలిపారు. 540 కిలోమీటర్ల వరకు తాగునీటి పైపులైన్లు వేయడంతో 42వేల కుటుంబాలకు నీళ్లు అందుతాయన్నారు. ప్రభుత్వం 120 గజాల్లో జీ ప్లస్ వన్ ఉన్న వారికి రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తుందన్నారు. తమ ఊరిలో ఉన్న చెరువుల్లో చెత్తాచెదారం వేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంద న్నారు. మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, జనరల్ మేనేజర్ అమరేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు గజ్జెల రామచంద్రం, బొక్క రాజేందర్‌రెడ్డి, మౌనిక శ్రీశైలం, గడ్డమీది రేఖ లక్ష్మణ్, సురేఖ రమేశ్, నాయకులు భూపాల్ రెడ్డి, లావణ్య, కామేశ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఆర్కేపురం: సరూర్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం సరూర్‌నగర్ డివిజన్ పరిధి హుడా కాలనీ, భగత్‌సింగ్‌నగర్, క్రాంతినగర్, ఉర్దూ మీడియం పాఠశాల, వెంకటేశ్వర కాలనీ రోడ్డు నంబర్ 3, భగత్‌సింగ్‌నగర్ ఫేస్-2 కాలనీల్లో రూ.85 లక్షలతో చేపట్టనున్న యూజీడీ పైప్‌లైన్ పనులకు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శివార్లలో పెరుగుతున్న కాలనీలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ ద్వారా రూ.1200కోట్ల నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేశారన్నారు. సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్స్, నూతన లైన్ల కోసం రూ.3,500 కోట్లు మంజూరు చేశారన్నారు.రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, మాజీ కార్పొరేటర్ అనితాదయాకర్‌రెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, యూత్వింగ్ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి, నాయకులు జిల్లెల కృష్ణారెడ్డి, రాజేశ్‌గౌడ్, మహేందర్‌యాదవ్, సుదర్శన్ముదిరాజ్, సలీం పాల్గొన్నారు.