Minister Puvvada | హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం నగరాభివృద్ధి : మంత్రి పువ్వాడ
Minister Puvvada | హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసినట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని 23వ డివిజన్లో రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఖమ్మం బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ విడుదల చేశారని, ఆ నిధులతో నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
ఖమ్మం, ఆగస్టు 28 : హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసినట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని 23వ డివిజన్లో రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఖమ్మం బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ విడుదల చేశారని, ఆ నిధులతో నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగ విరమణ వయస్సును సర్కార్ పెంచినందుకు గాను నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీలతో కలిసి సీఎం చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ పునుకొల్లు నీరజ, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హసన్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

